పోలీసులపై కొప్పుల ఈశ్వర్‌ వివాదాస్పద వాఖ్యలు | Ex Minister Koppula Eshwar Controversial Comments On Telangana Police, More Details Inside | Sakshi
Sakshi News home page

పోలీసులపై కొప్పుల ఈశ్వర్‌ వివాదాస్పద వాఖ్యలు

Jun 22 2025 3:18 PM | Updated on Jun 22 2025 5:43 PM

Ex Minister Koppula Eshwar Controversial Comments On Telangana Police

సాక్షి, జగిత్యాల జిల్లా: తెలంగాణ పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫోజులు కొట్టే కొంతమంది పోలీసులు బల్లకింద చేయి చాచకుండా కథ నడవదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పోలీస్ వ్యవస్థపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో పోలీసులు చేస్తున్న అవినీతి దందాపై నాయకులు దృష్టి పెడితే ఒక్క పోలీస్ కూడా విధుల్లో ఉండరంటూ షాకింగ్‌ కామెంట్‌ చేశారాయన. ‘‘అలాంటి నాయకులకు పోలీసులే భయపడాలి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. బల్ల కింద చేయి చాచనిదే ఏ ఒక్క పోలీసుకూ రోజు గడవదు’’ అంటూ కొప్పుల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement