ఓయూ దూరవిద్య పీజీ దరఖాస్తులకు చివరి తేదీ 6 | OU distance PG applications last date till March 6 | Sakshi
Sakshi News home page

ఓయూ దూరవిద్య పీజీ దరఖాస్తులకు చివరి తేదీ 6

Feb 26 2015 12:36 AM | Updated on Jul 31 2018 4:48 PM

ఓయూ దూరవిద్య ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి మార్చి 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డెరైక్టర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి మార్చి 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డెరైక్టర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులకు అసైన్‌మెంట్స్‌కు 20 మార్కులను వేయనున్నట్లు చెప్పారు.

డిగ్రీ విద్యార్థులు ఈ నెల 28 వరకు అసైన్‌మెంట్స్ అందజేయాలన్నారు. ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్న ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షకు మార్చి 20 వరకు అసైన్‌మెంట్స్ అందజేయాలి. పీజీ కాంటాక్టు క్లాసెస్ మార్చి మొదటి వారం నుంచి ప్రారంభంకానునట్లు డెరైక్టర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement