పీజీ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌! | PG Question paper leak at Rayalaseema University | Sakshi
Sakshi News home page

పీజీ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌!

Apr 5 2026 5:54 AM | Updated on Apr 5 2026 5:54 AM

PG Question paper leak at Rayalaseema University

లీక్‌ అయినట్లు చెబుతున్న ప్రశ్నాపత్రం

పరీక్ష ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ప్రశ్నాపత్రం బయటకు..   

రాయలసీమ యూనివర్సిటీలో ఘటన  

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ (ఆర్‌యూ) పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ అయినట్టు ప్రచారం సాగుతోంది. ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు సంబంధించి శనివారం టెక్నికల్‌ కమ్యూనికేషన్స్‌ పరీక్ష జరిగింది. ఆర్‌యూలోని పరీక్ష కేంద్రంలో వర్సిటీ కళాశాల నుంచి 14 మంది, బయట కళాశాలకు చెందిన నలుగురు కలిపి మొత్తం 18 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే పరీక్ష ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఉదయం 10.16 గంటలకు ప్రశ్నాపత్రం మొదటి పేజీ, 10.22 గంటలకు రెండో పేజీ పరీక్ష కేంద్రంలోంచి బయటకు వచ్చినట్లు జీపీఎస్‌ లొకేషన్‌లో నమోదైంది.  

విద్యార్థుల నుంచి సెల్‌ఫోన్లు లాక్కోవడంతో..
పలువురు విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో సెల్‌ఫోన్లు ఉపయోగించడంతో ఇని్వజిలేటర్లు వాటిని స్వా«దీనం చేసుకున్నారు. దీంతో పరీక్ష కేంద్రంలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. కొందరు విద్యార్థులు పరీక్ష ప్రారంభమయ్యాక బయటకు వెళ్లి సుమారు 40 నిమిషాల తర్వాత పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్వాహకులతో వాదించినట్లు సమాచారం.

నిర్వాహకులు అనుమతించక పోవడంతో వారే ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వైరల్‌ చేసినట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్సిటీ అధికారులు మాత్రం ప్రశ్నాపత్రం లీక్‌ కాలేదని.. పరీక్షల నిర్వహణను పకడ్బందీగా చేయడం వల్లే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement