టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు అనర్హుడు | YSRCP Leaders Demands Resignation of TTD Chairman BR Naidu: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు అనర్హుడు

Apr 5 2026 5:36 AM | Updated on Apr 5 2026 5:36 AM

YSRCP Leaders Demands Resignation of TTD Chairman BR Naidu: Andhra Pradesh

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని పైడితల్లి ఆలయం వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు

ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలి

హైందవ ధర్మానికి ప్రమాదకారి.. తిరుమల తిరుపతి పవిత్రతకు తీవ్రభంగం

వైఎస్సార్‌సీపీ నేతల నిరసన 

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు  

బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌గా అనర్హుడని, ఆయనను తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్‌ చేశాయి.  రాసలీలల బీఆర్‌ నాయుడు రాచపుండులా మారారని ధ్వజమెత్తాయి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్‌ నాయుడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. హైందవ, తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. 

సాక్షి,అమరావతి(సాక్షి, నెట్‌వర్క్‌): రాసలీలల బీఆర్‌ నాయుడు రాచపుండులా మారారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి. టీటీడీ చైర్మన్‌గా ఆయన అనర్హుడని, ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాయి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.  బీఆర్‌ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బీఆర్‌ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌ల తీరుపై మండిపడ్డారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలనూ చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌పీపీ మండిపడింది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వ్యవహారశైలిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని .. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి.. బీఆర్‌ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. పవిత్ర క్షేత్ర బాధ్యత అందరి బాధ్యతని, హైందవ ధర్మానికి క్యాన్సర్‌లా ప్రమాదకారిగా  పరిణవిుంచిన బీఆర్‌ నాయుడిని తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ హైందవ, తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేశారు.  

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు వేంకటేశ్వస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి బీఆర్‌ నాయుడికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. కృష్ణాజిల్లా పామర్రులోని ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బీఆర్‌ నాయుడికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు.  

⇒  గుంటూరు  జిల్లాలోని గుంటూరు, తెనాలి, ప్రత్తి­పాడు, మంగళగిరి, తాడికొండ నియోజవకర్గాల్లోనూ నాయకులు, కార్యకర్తలు గుడుల్లో ప్రత్యేక పూజలు చేశారు. పల్నాడు, బాపట్ల జిల్లాలోనూ నేతలు బీఆర్‌ నాయుడికి వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రత్యేక పూజల అనంతరం నిరసన వ్యక్తం చేశారు.  
⇒  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగి­రి, గూడురు నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌గా అనర్హుడని నాయకులు నినదించారు.  

⇒  ప్రకాశం జిల్లా దర్శి, సంతనూతలపాడు, కనిగిరి,  అద్దంకి, కొండపి,  యర్రగొండపాలెం, మార్కాపురం, కందుకూరు తదితర నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు పూజలు చేశారు. బీఆర్‌ నాయుడికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.   
⇒  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం,  తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని వేంకటేశ్వస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నేతలు నిర్వహించారు. బీఆర్‌నాయుడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.  
⇒ ఏలూరు జిల్లా  కైకలూరు, దెందులూరు, నూజివీడు, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. 

⇒  ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్‌ సీపీ నేతలు బీఆర్‌ నాయుడికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఆలయాల్లో పూజలు చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని నినదించారు.  
⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా­ల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణు­లు కదంతొక్కారు. ఆలయాల్లో ప్రత్యేక పూజ­లు చేశారు. టీటీడీ పవిత్రత కోసం ప్రార్థించారు.  
⇒  ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు బీఆర్‌ నాయుడు రాసలీలలపై ధ్వజమెత్తారు. ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే  చంద్రబాబైనా ఆయనను తొలగించాలని నినదించారు.  ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. 

⇒  ఉమ్మడి తిరుపతి జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేశారు. హైందవ ధర్మానికి నాయుడు ప్రమాదకారి అని నినదించారు. ఆలయల్లో పూజలు చేశారు. తిరుపతి తాతాయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. 

⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ బీఆర్‌ నాయుడుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతలు గళమెత్తారు. టీటీడీ చైర్మన్‌గా బీ­ఆర్‌ నాయుడు అనర్హుడని నినదించారు. టెంకాయలు కొ­ట్టి చంద్రబాబు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకున్నారు.   
⇒ ఉమ్మడి అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకా­కుళం జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదంతొక్కాయి. బీఆర్‌ నాయుడు రాసలీలలపై ధ్వజ­మెత్తారు. ఆలయాల్లో పూజలు చేసి, ర్యాలీలు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement