స్క్రబ్‌ టైఫస్‌తో వ్యక్తి మృతి | Scrub Typhus Kills Man in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

స్క్రబ్‌ టైఫస్‌తో వ్యక్తి మృతి

Apr 5 2026 5:11 AM | Updated on Apr 5 2026 5:26 AM

Scrub Typhus Kills Man in Andhra Pradesh

కోట: స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధితో చికిత్స పొందుతూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలంలో వ్యవసాయ కూలీ శనివా­రం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలి­పిన వివరాల మేరకు.. కోట మండలంలోని తిన్నెలపూడి అరుంధతీయకాలనీకి చెందిన ముత్యాలయ్య(65) పదిరోజుల క్రితం పశువులకు గడ్డి వేసే క్రమంలో చేతిపై పురుగు కుట్టడంతో చిన్న దద్దుర్లు వచ్చాయి.

రెండు రోజుల అనంతరం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు కోట ఆస్పత్రిలో చికిత్స అందించారు. జ్వరం తగ్గకపోవడంతో నెల్లూరులోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్క్రబ్‌టైఫస్‌గా డాక్టర్లు నిర్ధారించారు. అప్పటికే శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నట్లు గుర్తించి అత్యవసర చికిత్స అందించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు  తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement