సంప్రదాయాలు పాటిస్తేనే అర్చకత్వం | High Court orders state government and endowment department officials | Sakshi
Sakshi News home page

సంప్రదాయాలు పాటిస్తేనే అర్చకత్వం

Apr 5 2026 5:21 AM | Updated on Apr 5 2026 5:21 AM

High Court orders state government and endowment department officials

దీనిపై సర్క్యులర్, జగద్గురువుల ప్రామాణికతను అమలు చేయాలి 

రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భా­లయంలోకి ప్రవేశించే విషయంలో హైకోర్టు కీల­క ఆదేశాలు జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధి­లోని దేవాలయాల్లో పనిచేసే ఏ అర్చకుడైనా విదేశీయా­నం చేసి వస్తే, అతన్ని ప్రధాన ఆలయ గర్భాలయం­లో అర్చకత్వం (పూజా కార్యక్రమాలు) నిర్వహిం­చడానికి అనుమతించరాదంటూ 2010లో జారీ చేసి­న సర్క్యులర్‌ను, అలాగే 2024లో శృంగేరి శారదా­పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వా­మి జారీ చేసిన ప్రామాణికతను అమలు చేయా­లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలోకి ప్రవేశించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వ­ర్లు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పలువురు ప్రదాన అర్చకులు విదేశీయానం చేసి వచ్చారని, అ­యి­నా కూడా వారిని ప్రధాన గర్భాలయంలో అర్చక­త్వం నిర్వహణకు దేవదాయ శాఖ అధికారులు అనుమతిస్తున్నారని పేర్కొంటూ ఆ దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారుగా పనిచేస్తున్న డిఎస్‌ఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం సోమయాజీ హైకోర్టు­లో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషనర్‌ తరఫు న్యా­యవాది కేఆర్‌ శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, అర్చకత్వం విషయంలో  ప్రస్తుత దేవదాయ శాఖ నిబంధనలు, ఏపీ ధార్మిక పరిషత్తు జారీ చేసిన సర్క్యులర్, అలాగే 2024 డిసెంబర్‌ 12న  శ్రీ శారదాపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వామి జారీ చేసిన ప్రామాణిక మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement