బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుందాం రండి: శివసేన | Osmania beef festival puts Hyderabad on the boil | Sakshi
Sakshi News home page

బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకుందాం రండి: శివసేన

Dec 8 2015 7:36 PM | Updated on Sep 3 2017 1:42 PM

'ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న జరిగే బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకుందాం, గోమాతను రక్షించుకుందాం' అంటూ శివసేన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం కాచిగూడలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.సుదర్శన్ ఆవిష్కరించారు.

కాచిగూడ (హైదరాబాద్) : 'ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న జరిగే బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకుందాం, గోమాతను రక్షించుకుందాం' అంటూ శివసేన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం కాచిగూడలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.సుదర్శన్ ఆవిష్కరించారు.

హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క హిందువూ 10న జరిగే బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకునేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివసేన ప్రతినిధులు ఎ.నర్సింగ్‌రావు, భారతీయ విద్యార్థి సేన గ్రేటర్ అధ్యక్షులు ఎస్.గంగాధర్, ఎ.సందీప్, ఎ.తిరుమలేష్, ఎం.నరేష్, రాహుల్, సాయికిషోర్, వంశి, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement