పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి | Ordinances to be canceled Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి

Jun 16 2014 3:09 AM | Updated on Mar 18 2019 7:55 PM

పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి - Sakshi

పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి

పోలవరంలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కత్తి వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నర్సంపేట : పోలవరంలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కత్తి వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఆదివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ పోలవరం ముంపు గ్రామాలు 133 అయితే 274 గ్రామాలను మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కట్టబెట్టేందుకు ఆర్డినెన్స్ జారీ చేయడం దారుణమన్నారు.

సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను రూపొందించిందన్నా రు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రెండు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులుగా మారనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ సంపదను దోచుకోవడానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని కోరారు. దీక్షలో నాయకులు బానోతు నవీన్‌నాయక్, సాంబయ్య, తాబేటి శ్రీనివాస్, వెంకటనారాయణ, పూజారి శ్రీనివాస్, కట్టస్వామి, కేశవస్వామి, సాంబశివరావు, పంజాల రాము, రవి, సంజీవ, పాష, రవినాయక్, రమేష్, రవినాయక్, శ్రీనివాస్, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement