సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభి వృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ ప్రారంభమైంది. ‘టీఎస్‌బాక్స్ ఆఫీస్.ఇన్’ ద్వారా ఆన్‌లైన్ టికెట్స్ పొందొచ్చు. అలాగే షూటింగ్‌ల కోసం సింగిల్ విండో అనుమతులు అందించే ఆన్‌లైన్ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ రెండింటిని ప్రారంభిం చుకోవడం నిర్మాతలకు, ప్రేక్షకులకు, థియేటర్ యజమానులకు ఎంతో ఉపయోగకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలో ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్, సింగిల్ విండో అనుమతుల విధానాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ రాంమోహన్‌రావు, ఎఫ్‌డీసీ ఎండీ నవీన్ మిట్టల్, జేఎండీ కిషోర్ బాబు, సినీ ప్రముఖులు దిల్ రాజు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ వేసిందని, వారికి ఉపయోగపడే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు ఇస్తామన్నారు. సినిమా షూటింగ్‌ల కోసం వివిధ శాఖల నుంచి అనుమతుల కోసం నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీఎస్‌ఎఫ్‌డీసీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల్లోపు అన్ని అనుమతులు మంజూరవుతాయన్నారు. ఏడురోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్ ప్రారంభించుకోవచ్చన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధించి స్థలం ఎంపిక కోసం దీపావళి తరువాత పర్యటిస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని వివరించారు.
సినీ అవార్డుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షతన కమిటీ సమావేశమయ్యిందని, మార్గదర్శకాలు తయారుచేసి సీఎం అనుమతితో నిర్వహిస్తామన్నారు. రమణాచారి మాట్లాడుతూ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ ద్వారా సినీ విభాగాల్లో ఎంతో మంది శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ రాంమోహన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. చిత్ర పరిశ్రమలో సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగుతామన్నారు. నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ప్రేక్షకులకు, నిర్మాతలకు ఆన్‌లైన్ పోర్టల్ విధానం ఉపయోగపడుతుందన్నారు. టీఎస్ ఐపాస్ తరహాలోనే ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌ను ప్రారంభించామని, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆన్‌లైన్ అనుమతులకు సంబంధించి ప్రతి శాఖలో ఒక నోడల్ అధికారి ఉంటారని వీరందరు ఏడురోజుల్లో ఆన్‌లైన్ అనుమతులు ఇస్తారన్నారు.
మినీ థియేటర్లు.. ఆన్‌లైన్‌లో టికెట్లు..
Published Sun, Oct 8 2017 2:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement