యువతిపై అత్యాచారయత్నం | One held for rape attempt | Sakshi
Sakshi News home page

యువతిపై అత్యాచారయత్నం

Sep 5 2015 7:46 PM | Updated on Oct 16 2018 4:50 PM

మానసికస్థితి సరిగా లేని ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి యత్నించారు. యువతి సోదరి చూడడంతో ఆమె వారి చెర నుంచి బయటపడింది.

కరీంనగర్ : మానసికస్థితి సరిగా లేని ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి యత్నించారు. యువతి సోదరి చూడడంతో ఆమె వారి చెర నుంచి బయటపడింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీపురం గ్రామానికి చెందిన సాగర్, నరేష్ న్యూమారేడు పాక గ్రామానికి చెందిన మతిస్థిమితంలేని యువతిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళుతుండగా యువతి సోదరి చూసి కేకలు పెట్టింది. స్థానికులు వారిని అడ్డగించగా నరేష్ పరారయ్యాడు. సాగర్ దొరకడంతో అతడ్ని పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement