లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి | one dies,5 injured in road accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి

Apr 20 2015 7:34 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి.

నల్లగొండ: ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు గ్రామ శివారులో జరిగింది.

వివరాలు..జాతీయరహదారి65పై ఒక లారీ డీజిల్ అయిపోవడంతో ఆగి పోయింది. ఈ క్రమంలోనే విజమవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement