రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి | one died in narsapur express train incident | Sakshi
Sakshi News home page

రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి

Jun 25 2015 6:37 AM | Updated on Sep 3 2017 4:21 AM

రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి

రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి

వేగంగా వెళ్తున్న రైల్లోంచి జరిపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా వలిగొండ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.

వలిగొండ (నల్లగొండ): వేగంగా వెళ్తున్న రైల్లోంచి జరిపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా వలిగొండ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. గుంటూరుకు చెందిన సాంబ(25) సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు తన స్నేహితునితో పాటు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లో వెళ్తున్నాడు. ప్రయాణ సమయంలో స్నేహితులిద్దరూ మట్లాడుకుంటూ రైలు మెట్ల మీద కూర్చున్నారు.

అయితే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ వలిగొండ సమీపానికి వచ్చేసరికి ప్రమాదవశాత్తూ ఇద్దరు రైల్లోంచి జారిపడ్డారు. దీంతో సాంబ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని స్నేహితునికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు క్షతగాత్రున్ని రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement