breaking news
narsapur express train
-
నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైల్ లో దోపిడీకి యత్నం
-
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుశ్రత్.ఎం.మండ్రూప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు (07053) సికింద్రాబాద్ – కాకినాడటౌన్ ప్రత్యేకరైలు అక్టోబర్ 11వ తేదీ రాత్రి 9.40కు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు కాకినాడటౌన్ చేరుతుంది. రైలునెంబరు (07054) కాకినాడటౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేకరైలు అక్టోబర్ 13వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడటౌన్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు సికింద్రాబాద్ చేరుతుంది. రైలునెంబరు (07255) నరసాపూర్– సికింద్రాబాద్ ప్రత్యేకరైలు అక్టోబర్ 10,12వ తేదీలలో రాత్రి 6 గంటలకు నరసాపూర్లో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. రైలునెంబరు (07256) సికింద్రాబాద్–నరసాపూర్ ప్రత్యేకరైలు అక్టోబర్ 11వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కు నరసాపూర్ చేరుతుంది. రైలునెంబరు(07255) నరసాపూర్ – సికింద్రాబాద్ ప్రత్యేకరైలు అక్టోబర్ 13వ తేదీ రాత్రి 8.50కు నరసాపూర్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.50కు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ ప్రత్యేకరైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు సాగిస్తాయని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో తెలిపారు. -
రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి
వలిగొండ (నల్లగొండ): వేగంగా వెళ్తున్న రైల్లోంచి జరిపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా వలిగొండ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. గుంటూరుకు చెందిన సాంబ(25) సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు తన స్నేహితునితో పాటు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లో వెళ్తున్నాడు. ప్రయాణ సమయంలో స్నేహితులిద్దరూ మట్లాడుకుంటూ రైలు మెట్ల మీద కూర్చున్నారు. అయితే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ వలిగొండ సమీపానికి వచ్చేసరికి ప్రమాదవశాత్తూ ఇద్దరు రైల్లోంచి జారిపడ్డారు. దీంతో సాంబ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని స్నేహితునికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు క్షతగాత్రున్ని రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.