ఆర్టీసీ బస్సు,కారు ఢీ | One died and 5 injured in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు,కారు ఢీ

Jul 10 2016 10:45 AM | Updated on Sep 4 2017 4:33 AM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

మానకొండూరు (కరీంనగర్): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు శివారులో ఆదివారం చోటుచేసుకుంది.

నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. కారులో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement