అనుమతులు లేని ఆస్పత్రి సీజ్‌ | officials seized a private hospital in Kothagudem | Sakshi
Sakshi News home page

అనుమతులు లేని ఆస్పత్రి సీజ్‌

Jul 15 2017 2:24 PM | Updated on Sep 5 2017 4:06 PM

అనుమతులు లేని ఆస్పత్రి సీజ్‌

అనుమతులు లేని ఆస్పత్రి సీజ్‌

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రిని వైద్యశాఖ అధికారులు సీజ్‌ చేశారు.

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని వినాయకుడి ఆలయం సమీపంలో ఉన్న సంఘమిత్ర ఆసుపత్రిని వైద్య శాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రిని సీజ్‌ చేయడానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, సిబ్బంది రాగా ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్ల బంధువులు వారిని అడ్డుకున్నారు.

దీంతో పోలీసుల బందోబస్తు మధ్య ఆసుపత్రి ప్రధాన ద్వారానికి అధికారులు తాళం వేసి సీల్‌ వేశారు. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నట్లు సమాచారంతోనే అక్కడికి వచ్చి, తనిఖీలు నిర్వహించి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement