మెడికల్‌ కాలేజీకి స్థల పరిశీలన | Observation of Medical College | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీకి స్థల పరిశీలన

Oct 15 2017 3:34 PM | Updated on Mar 21 2019 8:24 PM

నల్లగొండ రూరల్‌: ఎస్‌ఎల్‌బీసీలో మెడికల్‌ కాలేజీకి అవసరమైన ఖాళీ స్థలాలను కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, ఎంపీ సుఖేందర్‌రెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్‌ వినయ్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. సీఎం సూర్యాపేటలో నిర్వహించిన సభలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలు పరిశీలించారు.  ఎస్‌ఎల్‌బీసీ కోసం భూమిని గతంలో సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తారా..! ఇతర ప్రభుత్వ పథకాలకు వినియోగిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement