బాసర ఆలయ పూజారులకు నోటీసులు
బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బయటకు తరలించిన ఇద్దరు పూజారులకు నోటీసులు జారీ అయ్యాయి.
- పరారీలో పూజారులు
నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బయటకు తరలించిన ఇద్దరు పూజారులకు నోటీసులు ఇచ్చినట్లు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అక్షరాభ్యాసాలు చేయించేందుకు వీరిద్దరూ ఆలయం నుంచి అనుమతి లేకుండా ఉత్సవ విగ్రహాన్ని తరలించిన విషయం విదితమే. ఆలయానికి అప్రదిష్ట మూటగట్టిన ప్రధాన పూజారి సంజీవ్‌రావు, మరో పూజారి ప్రణవ్ శర్మలు పరారీలో ఉన్నారు.
కాగా ప్రధాన పూజారి సంజీవ్ రావు అనారోగ్యకారణాలతో నిజామాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.