ఎక్సలెంట్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ | NIRF Award to Saint Francis College Hyderabad | Sakshi
Sakshi News home page

ఎక్సలెంట్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌

Jun 12 2020 8:53 AM | Updated on Jun 12 2020 8:53 AM

NIRF Award to Saint Francis College Hyderabad - Sakshi

విద్యార్థుల కేరింతలు(ఫైల్‌)

జూబ్లీహిల్స్‌: గతేడాది 50వ వసంతం పూర్తిచేసుకొని గోల్డెన్‌ జూబ్లీ జరుపుకున్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాల తాజాగామరో అరుదైన ఘనత సాధించింది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ఫ్రేమ్‌వర్క్‌’ పేరుతో ఆ శాఖ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌గురువారం నివేదిక విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంనుంచి ఏకైక కాలేజీగా, దేశవ్యాప్తంగా టాప్‌ 100లో73వ స్థానంలో నిలిచి అరుదైన ఘనత సాధించినట్లుకాలేజీ యాజమాన్యం వివరించింది.  

నేపథ్యం..
సిస్టర్స్‌ ఆఫ్‌ చారిటీ.. ఇటలీలో 1832లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా సామాజిక, విద్యారంగంలో సేవలు అందిస్తున్న ప్రఖ్యాత సేవాసంస్థ. 1860 ప్రారంభంలో మనదేశంలో ప్రవేశించిన సంస్థ క్రమంగా తన సేవలను విస్తరించుకుంటూ వచ్చింది. 1959లో 15మంది విద్యార్థినులతో సికింద్రాబాద్‌లో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీ పేరుతో మహిళా కళాశాల ప్రారంభించింది. ముందుగా బీఏకోర్స్‌ తర్వాత బీకామ్, బీఎస్సీ కోర్స్‌లు ప్రారంభించింది. 1977 ప్రాంతంలో బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో 8ఎకరాల సువిశాల ప్రాంగణంలోకికళాశాలను మార్చారు.  
1999లో నాక్‌ 5 స్టార్‌ గుర్తింపు లభించింది. ఆ తర్వాత క్రమంగా 2006, 2012లో ఏ గ్రేడ్‌తో గుర్తింపు కొనసాగింది. 2014లో ప్రతిష్టాత్మకమైన‘కాలేజ్‌ విత్‌ పొటెన్షియల్‌ ఎక్స్‌లెన్స్‌’ (సీపీఈ)గా నాక్‌ ప్రకటించింది.  2018లో గోల్డెన్‌ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. క్రమంగాకొత్త కోర్సులు ప్రారంభిస్తూ వచ్చారు. ప్రస్తుతం 172మందిఅధ్యాపకులు, 110మంది నాన్‌టీచింగ్‌ స్టాఫ్,4వేలకు పైగా విద్యార్థినులతో కార్యకాలపాలు నిర్వహిస్తోంది.  

అటానమస్‌..
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న కళాశాలకు నగరంలో మొదటిసారిగా 1988లో యూజీసీ అటానమి హోదా లభించింది. 2015 నుంచి కాలేజీలో ‘ఛాయిస్‌ అండ్‌ క్రెడిట్‌ బేస్డ్‌ సెమిస్టర్‌ సిస్టమ్‌’(సీసీబీఎస్‌ఎస్‌) పద్ధతి అమలు చేస్తున్నారు. దీనిద్వారా కరిక్యులమ్, ప్రాజెక్ట్స్‌ డిజైన్, ప్రెజెంటేషన్, స్లిప్‌టెస్ట్, క్విజ్‌పద్ధతిలో పరీక్షల నిర్వహణ చేస్తున్నారు. కోర్స్‌లను స్వతంత్రంగా డిజైన్‌ చేసుకునే అవకాశం లభించింది.

స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ సదుపాయాలు..
83వేలకు పైగా పుస్తకాలు, ‘స్లిమ్‌ 21’ పేరుతో కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ జర్నల్స్, ఇంటర్‌నెట్‌ రిసోర్స్‌ సెంటర్, భారీ సైన్స్‌ ల్యాబ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, కంప్యూటర్‌ ల్యాబ్, యూజీ, పీజీ సైకాలజీ ల్యాబ్, మాస్‌కమ్యునికేషన్‌ ల్యాబ్, ఇండోర్‌ స్టేడియం, స్టూడెంట్‌ కార్నర్, మైక్రోబయాలజికి ప్రత్యేకించిన లూయిస్‌పాశ్చర్‌ రీసెర్చ్‌ ల్యాబ్, ఫిటనెస్‌ సెంటర్, హెల్త్‌సెంటర్, అమెరికన్‌ కార్నర్‌ తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు.

విలువలతో కూడిన విద్యాబోధన
1959లో కేవలం 15మంది విద్యార్థినులతో ప్రారంభమైన మా ప్రయాణం ఐదు దశాబ్ధాల కాలంలో 4వేలకు పైగా విద్యార్థినులు,28 విభాగాలు, 300కు పైగా టీచింగ్, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌తో సాగుతూఎంతో ఉత్తేజం ఇస్తోంది. ఆడపిల్లలకు నాణ్యమైన విద్య, క్రీడాంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం.
సంప్రదాయ విలువలకు, ఆధునిక విద్యను జోడిస్తూ ముందుకుసాగుతున్నాం. విలువలతో కూడిన విద్యా బోధన ఇక ముందుకూడా కొనసాగుతుంది.– సాండ్రాహోర్తా, ప్రిన్సిపల్, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాల.  

కోర్సులు..
26 వివిధ డిపార్ట్‌మెంట్స్‌తో పలు పీజీ,యూజీ కోర్సులు, సర్టిఫికెట్‌ కోర్సులు, ఫారిన్‌ కోలాబరేషన్‌తో కొన్ని కోర్సులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement