
కరోనా మహమ్మారి నివారణకు ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పుసుపుకొమ్ములు ధరించి..
సాక్షి, శంషాబాద్ రూరల్: పసుపు కొమ్ములు ధరించాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం అవాస్తవమని శ్రీఅహోబిల జీయర్ స్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి నివారణకు ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పుసుపుకొమ్ములు ధరించి, అమావాస్య తర్వాత తీసివేయాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, వీటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. కరోనా వైరస్ కట్టడి కావాలంటే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భగవంతుడిని ధ్యానిస్తే మనకు మానసిక బలం చేకూరుతుందని వివరించారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి భగవంతుని నామ స్మరణ చేయాలని, రోగ నివారణ కోసం వైద్య చికిత్స అవసరమని పేర్కొన్నారు.