కొత్త సంవత్సరం...కొత్త రేషన్ | New year ... new ration | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరం...కొత్త రేషన్

Jan 1 2015 3:50 AM | Updated on Oct 2 2018 8:49 PM

కొత్త పథకమైన ‘ఆహార భద్రత’ను కొత్త సంవత్సరాదిన అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

  • ఆహార భద్రత పథకాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
  •  సూపర్ ఫైన్ బియ్యంతో పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం
  •  ఆహార భద్రత కార్డులకు 7,00,260 కుటుంబాల అర్హత
  •  ‘అమ్మ హస్తం’ పథకానికి మంగళం
  • ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్త పథకమైన ‘ఆహార భద్రత’ను కొత్త సంవత్సరాదిన అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి కొత్త రేషన్ విధానం (ఆ హార భద్రత పథకం) అమలవుతుంది. ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇచ్చేందుకు ఆహారభద్రత కార్డులు ఇస్తోం ది. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాల ల్లో సూపర్ ఫైన్ బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.

    జిల్లాలో ఈ పథకాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం 11 గంటలకు ఏన్కూరులోని సాంఘిక సంక్షేమ భవన్‌లో ప్రా రంభిస్తారు. ఆ తరువాత, అక్కడే విద్యార్థులతో కలిసి భో జనం చేస్తారు. జిల్లావ్యాప్తంగా ఈ పథకానికి 7,93,694 మంది దరఖాస్తు చేశారు. వీటిలో 7,75,689 దరఖాస్తుల ను అధికారులు పరిశీలించారు.

    7,00,260 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 16,000దరఖాస్తులను విచారిం చాల్సుంది. జిల్లాలోని సంక్షేమహాస్టళ్లకు 1155.726 టన్ను లు, మధ్యాహ్న భోజనానికి 583.749 మెట్రిక్ టన్నుల సూఫర్ ఫైన్ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. ‘ఆహార భద్రత పథకం అమలుతో.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మ హస్తం’కు మంగళవారం పాడినట్టరుంది.
     
    13,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ
     
    ఏన్కూరు: జిల్లాలో జనవరి 1 నుంచి చౌక దుకాణాల ద్వారా 13,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్ తెలిపారు. ఆయన బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో చౌక దుకాణాల ద్వారా 9000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్టు తెలిపారు.

    కుటుంబంలో ఒక వ్యక్తికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేయనుండడంతో అదనంగా 4000 మెట్రిక్ టన్నుల బియ్యం పెరిగిందన్నారు. జిల్లాలో 2,75,000 మంది విద్యార్థులకు జనవరి 1 నుంచి సన్న బియ్యంతో భోజనం అందించనున్నట్టు చెప్పారు. నెలకు 1700 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతుందన్నారు. సన్న బియ్యం పంపిణీతో అదనంగా 15కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement