వైట్‌ రైస్‌ వర్సెస్‌ బ్రౌన్‌ రైస్‌ ఆరోగ్యానికి ఏది మంచిదంటే.. | Health Benefits: The Real Difference Between White Rice And Brown Rice | Sakshi
Sakshi News home page

వైట్‌ రైస్‌ వర్సెస్‌ బ్రౌన్‌ రైస్‌ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..

May 28 2026 9:41 AM | Updated on May 28 2026 9:43 AM

Health Benefits: The Real Difference Between White Rice And Brown Rice

ఇటీవలకాలంలో అందరు ఆరోగ్య స్పృహతో పోషకవంతమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా భోజనం విషయంలో వైట్‌రైస్‌ కంటే బ్రౌన్‌రైస్‌ని, చపాతీలను, తాజా పండ్లు, కూరగాయలను వినయోగిస్తున్నారు. కొందరు మితంగా వైట్‌ రైస్‌ తీసుకుంటూ ఆకుకూరలు, నట్స్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ వైట్‌రైస్‌ అసలు తినకపోవడమే మంచిదా?, బ్రౌన్‌ రైస్‌ మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? అంటే ఆ ఆలోచనే సరైనది కాదంటున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . బ్రౌన్‌ ఆరోగ్యానికి మంచిదనేది నిజమే అయినప్పటికీ పూర్తిగా వైట్‌ రైస్‌ తీసుకోకూడదని కాదు అంటున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య రీత్యా ఏది తీసుకుంటే మంచిదనేది ఆధారపడి ఉంటుందంటున్నారు. అదెలాగంటే..

తెల్లబియ్యం..
తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అది సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో కొంతమందికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తీవ్రమైనప్పుడు, తప్పక ఫైబర్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, తినేందుకు మృదువుగా ఉంటుంది.

బ్రౌన్‌రైస్‌
ఇందులో పోషకమైన మొలక, పీచుపదార్థం గల ఊక, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండోస్పెర్మ్‌ తదితరాలు ఉంటాయి. దీని గరుకైన ఊక ఉపరితలం కారణంగా నమలడానికి గట్టిగానూ ఉడికేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది.

పోలిస్తే..
సమతుల్య ఆహారంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఉంటాయి. అయితే, తెల్ల బియ్యంతో పోలిస్తే, బ్రౌన్ రైస్‌లో ఊక, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్  అనేక బి విటమిన్లు (బి1, బి3, బి6, మరియు బి9) అధిక స్థాయిలో ఉంటాయి

ఆరోగ్య పరంగా..
ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తుంటే, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గడం, అలాగే బరువును మెరుగ్గా నియంత్రించుకోవడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తెల్ల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ± 4, ఇది అధికం.  

బ్రౌన్ రైస్‌ను మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ 68 ± 4 కారంగా ఆరోగ్యప్రదంగా పరిగణించారు నిపుణులు. అదీగాక, బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది, కానీ తెల్ల బియ్యం తినడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.

ఎలా తీసుకుంటే మంచిదంటే..
చాలా మంది బ్రౌన్ రైస్ మంచిదన్న ఉద్దేశ్యంతో దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీనిలోని అధిక ఫైబర్‌ జీర్ణం చేసుకోవడం కష్టతరం చేసి జీర్ణసంబంధిత రుగ్మతలు తీవ్రమై ప్రమాదం లేకపోలేదని అంటున్నారు ఆదర్శ గౌడ. 

అందువల్ల బ్రౌన్‌ రైస్‌, వైట్‌రైస్‌ రెండిటిని కలిపి ఎంచుకోమని సూచిస్తున్నారు నిపుణులు. మెరుగైన పోషకాహారం కోసం కొద్దిపాటి మార్పులతో రెండిటిని సమంగా తీసుకునే ప్రయత్నం చేయమని అంటున్నారు అప్పుడు శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు ఆదర్శ గౌడ.

(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

 

 

Advertisement
 
Advertisement
Advertisement