తెలంగాణలో రిటైల్ మద్యం షాపుల కోసం ఎల్లుండి(సోమవారం) నోటిఫికేషన్ విడుదలకానుంది.
హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ మద్యం షాపుల కోసం ఎల్లుండి(సోమవారం) నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ నెల 21 వరకు మద్యం షాపుల కోసం అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో షాపుల కోసం డ్రా తీయనున్నారు. ఈ నెల 28న మద్యం షాపుల లైసెన్స్లు జారీ చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది.