22న నరేంద్ర మోడీ రాక | Narendra Modi's arrival on 22 | Sakshi
Sakshi News home page

22న నరేంద్ర మోడీ రాక

Apr 17 2014 4:31 AM | Updated on Aug 15 2018 2:14 PM

భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈనెల 22న జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తెలిపారు.

ఎల్లారెడ్డి రూరల్, న్యూస్‌లైన్ : భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈనెల 22న జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోడీ సభకు లక్షలాదిమంది తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అనువైన మూడు స్థలాలను పరిశీలించామని, పార్టీ రాష్ట్ర బాధ్యులు, స్థానిక అధికారులతో చర్చిం చిన అనంతరం స్థలాన్ని ఎంపిక చేస్తామన్నారు.

సభను ఉదయం 11గంటలకు నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. సభను విజయవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించనున్నామన్నారు. ఆయ న వెంట టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జహీరాబాద్ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు, ఎల్లారెడ్డి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, మాజీమంత్రి నెరేళ్ల ఆంజనేయులు తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement