
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యానాథ్‌లు ఎన్నికల ప్రచారానికి హాజరు కానున్నారు. వీరితో పాటు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు కూడా త్వరలో ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ నేత మరళీధర్‌రావు శుక్రవారం ఓ సమావేశంలో ప్రకటించారు.
మహాకూటమి మహాకుంపటిలా తయారైందని ఎద్దేవా చేశారు. ఎఐఎం ఫెవికాల్ పార్టీ టీఆర్‌ఎస్ అని, రెండు పార్టీలు కుమ్మకై ఎన్నికలకు వెళ్లాయని ఆరోపించారు. కుటుంబ రాజకీయాలను దూరంగా ఉంచే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు.