తెలిసిన వ్యక్తే.. కిడ్నాపర్‌ | Nandipet Kidnaped Girl Safe In Kerala | Sakshi
Sakshi News home page

తెలిసిన వ్యక్తే.. కిడ్నాపర్‌

Aug 5 2018 7:00 PM | Updated on Oct 17 2018 6:10 PM

Nandipet Kidnaped Girl Safe In Kerala - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట్‌ మండలంలో చిన్నారి మనీశ్వరి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కేరళ రాష్ట్రంలోని త్రివేండంలోని పోలీసుల అదుపులో ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. చిన్నారి కోసం తల్లిదండ్రులు, పోలీసులు త్రివేండం వెళ్లనున్నారు. గీతా కాన్వెంట్‌ హైస్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న మనీశ్వరి శుక్రవారం రోజున అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఓ మహిళ వచ్చి పాపను తీసుకెళ్లిందని పాఠశాల సిబ్బంది తెలిపారు. పాప తల్లిదండ్రుల ఫిర్యాదుతో.. సీసీటీవీలో రికార్డు అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు రజితగా గుర్తించారు. చిన్నారి కుటుంబానికి నిందితురాలు రజిత తెలిసిన వ్యక్తిగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement