కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ | Nalgonda Leaders Join TRS | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ

Jun 4 2018 7:32 AM | Updated on Aug 15 2018 9:06 PM

Nalgonda Leaders Join TRS - Sakshi

ఆలేరు : శ్రీనివాసపురంలో ప్రభుత్వవిప్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్న యువకులు

ఆలేరు : ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. మండలంలోని శ్రీనివాసపురంలో ఆదివారం ఆమె సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎంపీపీ కాసగళ్ల అనసూయ, ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్, పరుశురాములు, ఎల్లయ్య, మహేశ్, భాస్కర్‌ పాల్గొన్నారు.

 బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాంలింగంపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి సమక్షంలో ఆమె నివాసంలో 300 మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెడతానన్నారు. మాజీ ఎంపీటీసీ యంజాల సత్యనారాయణ, ఎంపీపీ తిరుపతిరెడ్డి, సల్ల రవి పాల్గొన్నారు.

 పాఠశాలను పరిశీలించిన ప్రభుత్వ విప్‌

రాజాపేట : మండలంలోని రేణికుంట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న గదుల సంఖ్యను తెలు సుకున్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటు చేయడం కోసం స్కూల్‌ను పరిశీలించినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కోరె లలిత, మండల ప్రధాన కార్యదర్శి కోరుకొప్పుల వెంకటేశ్‌గౌడ్, నాయకులు చింతలాపురి వెంకట్‌రాంరెడ్డి, బోళ్ల రాఘవరెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లయ్య, మాతయ్య, చామకూరు గోపాల్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, దాచపల్లి శ్రీను పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement