క్షేత్రస్థాయిలోనే అవినీతి బయటపెడతా

Nagam Janardhan Reddy threw a political challenge against the Telangana government - Sakshi

విలేకరుల సమావేశంలో బీజేపీ నేత నాగం

ఉమామహేశ్వరంలో చర్చావేదిక హాస్యాస్పదం

సీఎంతో బహిరంగ చర్చకు ఒప్పించాలి  

సాక్షి, నాగర్‌కర్నూల్‌: మూడేళ్లలోనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆ యన అనుచరులు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, వీటిని ఆలయా ల వద్ద చ ర్చించడం కాదని, క్షేత్రస్థాయిలో నే చిట్టా విప్పుతానని బీజేపీ నేత నా గం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం లో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మర్రి తనను బహిరంగచర్చకు ఆహ్వానించి ఉమామహేశ్వరంలో వేదిక ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని, అవినీతి జరిగిన చోటే చర్చిద్దాం రమ్మని సవాల్‌ విసిరారు.

కేసీఆర్‌ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిపై ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తాను బహిరంగ చర్చలో పాల్గొనాల్సి వస్తే సీఎం కేసీఆర్‌తో కూర్చుని పాత్రికేయుల ముందే ఆయన బండారాలు బయట పెడతానని, సీఎంను తనతో బహిరంగ చర్చకు వచ్చేవిధంగా ఎమ్మెల్యే ఒప్పించాలని నాగం సూచించారు. ఎంజేఆర్‌ ట్రస్ట్‌ ద్వారా మర్రి జనార్దన్‌రెడ్డి రూ.12కోట్లు వెచ్చించి పేదలకు పెళ్లిళ్లు చేశానని ప్రకటించారని, ఒక్కో జంటకు ఎంత ఖర్చు చేశారో లెక్క చూపించాలన్నారు. రూ.12కోట్లు ఖర్చు చేస్తున్న ఎమ్మెల్యే పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు ఏ మేరకు ఉపాధి అవకాశాలు కల్పించారో బయట పెట్టాలన్నారు. రాంచంద్రారెడ్డి, అర్థం రవి, కాశన్న, నసీర్‌ ఉన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top