‘ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి’

Muthyala Laxmareddy Ask KCR To Given Opportunity As An MLC - Sakshi

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ) : ఖాళీ అయిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో హాసాకొత్తూర్‌కు చెందిన ముత్యాల లక్ష్మారెడ్డి అలియాస్‌ కొత్తూర్‌ లక్ష్మారెడ్డి ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్న లక్ష్మారెడ్డి తనకు నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో కలిసిన లక్ష్మారెడ్డి తన ప్రతిపాదనను సీఎం ముందు ఉంచారు. లక్ష్మారెడ్డి ప్రస్తుతం గాయత్రి కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

హాసాకొత్తూర్‌కు చెందిన లక్ష్మారెడ్డికి, కేసీఆర్‌ రాజకీయాల్లోకి రాకముందు నుంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ను స్థాపించిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులను పొందారు. మొదట్లో బాల్కొండ ఎమ్మెల్యే టికెట్‌ను లక్ష్మారెడ్డి కోరారు. రాజకీయ సమీకరణాలతో ఆయనకు అవకాశం లభించలేదు. అయినా ఆయన పార్టీ కి సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న లక్ష్మారెడ్డి సీఎంను కలిసి విన్నవించగా కేసీఆర్‌ నుంచి సానుకూలత వచ్చినట్లు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top