
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిర్మాణం జరుగుతున్న ఓ ఇంట్లో పారతో తలపై కొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ఇబ్రహీంపట్నానికి చెందిన రాజు(44) అనే మేస్త్రిగా గుర్తించారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.