
కేసీఆర్ పై మోత్కుపల్లి తీవ్రారోపణలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రారోపణలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రారోపణలు చేశారు. తమను చంపిచేందుకు కేసీఆర్ పథకం వేస్తున్నట్టు సమాచారం అందుతోందని ఆరోపించారు. ఇందులోభాగంగా తమ గన్మెన్లను తొలగించారని అన్నారు.
అధికారంలో లేనప్పుడు కేసీఆర్ ఎందుకు గన్మెన్లను పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తప్పులను ప్రశ్నిస్తున్నారనే టీడీపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయించారని విమర్శించారు.