పిల్లలతో కలసి తల్లి చావాలనుకుంది | Sakshi
Sakshi News home page

పిల్లలతో కలసి తల్లి చావాలనుకుంది

Published Sat, Jun 6 2015 12:11 AM

mother tried to death with her childern

రాంగోపాల్‌పేట్(సికింద్రాబాద్): భర్తతో తలెత్తిన గొడవల కారణంగా ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నిస్తుండగా పోలీసులు రక్షించారు. లేక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం...పార్శీగుట్టకు చెందిన బి. కిరణ్‌కుమార్, రంజిత పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు.

అయితే, రంజితకు రోజూ కల్లు తాగే అలవాటు ఉంది. దీంతో పిల్లలను కూడా సరిగా పట్టించుకోవటం లేదని భర్త్త కిరణ్ ప్రశ్నించటంతో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చనిపోవాలని నిశ్చయించుకుంది. ఇద్దరు పిల్లలను తీసుకుని గురువారం రాత్రి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. అనుమానాస్పదంగా ఉన్న ఆమెను గస్తీ నిర్వహిస్తున్న లేక్ పోలీసులు ప్రశ్నించగా విషయం చెప్పింది. ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్లి ఇన్స్‌పెక్టర్ శ్రీదేవి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement