కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం | mother suicide attempt in khammam | Sakshi
Sakshi News home page

కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం

Feb 26 2015 12:29 PM | Updated on Sep 2 2017 9:58 PM

కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం

కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం

క్షణికావేశం ఇద్దరి ప్రాణాల మీదకి తెచ్చింది.

ఖమ్మం : క్షణికావేశం ఇద్దరి ప్రాణాల మీదకి తెచ్చింది. భర్తపై కోపంతో మూడు నెలల చిన్నారి గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన  ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడలో చోటుచేసుకుంది. వివరాలు.... మండలంలోని గాండ్లగూడ తండాకు చెందిన మాలావతి ప్రియాంక, చిట్టిబాబులకు ఏడాదిన్నర కిందట వివాహమైంది. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు.

అయితే మూడు రోజుల నుంచి భార్యభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి. గురువారం ఉదయం చిట్టిబాబు ఓ వివాహానికి వెళ్లగా ప్రియాంక తన కొడుకు గొంతు కోసి తాను కూడా గొంతు కోసుకుంది. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న తల్లి, కొడుకును స్థానికులు అశ్వారావు పేట ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు.  చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement