సాక్షి, తాడేపల్లి: మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాతృమూర్తి బూడి సింహాచలమ్మ (88) వయోభారంతో కన్నుమూయడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సింహాచలమ్మ మృతి బూడి ముత్యాల నాయుడు కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మాతృ వియోగం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని బూడి ముత్యాల నాయుడికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదీ చదవండి: లే కన్నా.. ఇంటికెళ్దాం!


