కుమార్తె గొంతు నులిమి చంపిన తల్లి | Mom killed newborn baby in vikarabad | Sakshi
Sakshi News home page

కుమార్తె గొంతు నులిమి చంపిన తల్లి

Nov 16 2014 10:23 AM | Updated on Mar 28 2018 11:11 AM

కుమార్తె గొంతు నులిమి చంపిన తల్లి - Sakshi

కుమార్తె గొంతు నులిమి చంపిన తల్లి

అప్పుడే పుట్టిన ఆడ శిశువు గొంతును కన్నతల్లి గొంతునులిమి చంపేసింది.

వికారాబాద్: అప్పుడే పుట్టిన ఆడ శిశువు గొంతును కన్నతల్లి నులిమి చంపేసింది. ఆ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని ఉందూరు తండాలో  చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది కన్నతల్లి కవితని నిలదీశారు. ఇప్పటికే రెండు సార్లు ఆడపిల్లలు జన్మించారని... మరోసారి కూడా ఆడపిల్ల జన్మించిందని కవిత తెలిపింది. అదికాక కుటుంబంలో కూడా ఒత్తిడి అధికమైన నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె ఆసుపత్రి సిబ్బంది వద్ద తెలిపినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. శనివారం సాయంత్రం ఆడ శిశువు జన్మించిందని ఆ సమయంలో తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయితే రాత్రి శిశువును పరీక్షించగా చనిపోయినట్లు గ్రహించామని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. దాంతో కన్నతల్లి కవితను ఆసుపత్రి సిబ్బంది నిలదీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement