గల్లంతైన విద్యార్థి శవం లభ్యం | missing student dead body recovered | Sakshi
Sakshi News home page

గల్లంతైన విద్యార్థి శవం లభ్యం

Aug 16 2015 4:43 PM | Updated on Sep 3 2017 7:33 AM

రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం దిండా గ్రామ సమీపంలోని వాగులో గల్లంతైన విద్యార్థి శవం ఎట్టకేలకు ఆదివారం లభ్యమైంది.

జైపూర్ (ఆదిలాబాద్ జిల్లా): రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం దిండా గ్రామ సమీపంలోని వాగులో గల్లంతైన విద్యార్థి శవం ఎట్టకేలకు ఆదివారం లభ్యమైంది. వివరాలు.. దిండా గ్రామానికి చెందిన రామకృష్ణ హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. కాగా, రెండు రోజుల క్రితం నగరం నుంచి స్వగ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే గ్రామ శివారులో ఉన్న వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి కొట్టుకొనిపోయి గల్లంతయ్యాడు.

కాగా, యువకుడి ఆచూకీ కోసం గ్రామస్తులు రెండు రోజులుగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఆదివారం గ్రామ సమీపంలోనే వాగులో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement