మైనర్ పై అత్యాచారం | Minor raped | Sakshi
Sakshi News home page

మైనర్ పై అత్యాచారం

Mar 11 2016 7:10 PM | Updated on Jul 28 2018 8:53 PM

బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. 'ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా.. నీకో విషయం చెప్తాను' అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

హైదరాబాద్ : బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. 'ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా.. నీకో విషయం చెప్తాను' అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది.

స్థానికంగా నివాసముంటున్న బాలిక(12)పై అదే ప్రాంతంలో కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న హరీష్(22) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement