విద్యావేత్త అయోధ్య రామారావు మృతి

Minister Thanneeru Harish Rao Gave Tribute To The Ramarao dead In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : వాణినికేతన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ చీటి అయోధ్య రామారావు(82) అనా రోగ్యంతో శుక్రవారం కరీంనగర్‌లో మృతిచెం దారు. కొన్ని నెలలుగా వయోభారం, అనా రోగ్యంతో బాధపడుతున్నారు. మాజీ మంత్రి, సీని యర్‌ కాంగ్రెస్‌ నేత ఎం.సత్యనారాయణరావుకు అయోధ్యరా మారావు స్వయాన సోదరుడు. ఆయన మృతి వార్త తెలియగానే మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రణా ళికా సంఘం ఉపాధ్యాక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, సుడా చైర్మన్‌ జీవీ రామక్రిష్ణారావు, త దితరులు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుం బ సభ్యుల ను ఓదార్చారు. విద్య, సాహితీ లో కానికి ఆయన మరణం తీరని లోటన్నారు.

ప్రముఖుల సంతాపం...
అయోధ్య రామారావు మృతి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కోరేం సంజీవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతపల్లి శ్రీనివాస్‌రావు సంతాపం ప్రకటించారు. జిల్లా కన్జ్యూమర్‌ ఫోరం అధ్యక్షుడు చిట్టినేని లతకుమారి, రంగారెడ్డి, కరీంనగర్‌ మాజీ డీఈవో అనభేరి రాజేశ్వరావు, తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి దాస్యం సేనాధిపతి, ఉదయసాహితీ అధ్యక్షుడు వైరాగ్య ప్రభాకర్, కవులు బీయన్‌ఆర్‌ శర్మ, మాడిశెట్టి గోపాల్, కేఎస్‌ అనంతాచార్య, పొన్నం రవిచంద్ర, గాజుల రవీందర్‌ ఉన్నారు. 

                              నివాళి అర్పిస్తున్న మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు

ప్రముఖ విద్యాసంస్థల అధినేతగా..
చీటి అయోధ్య రామారావు కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో 1937 జూలై 21 న చీటి హన్మంతరావు, యశోదమ్మ దంపతలకు జన్మించారు.  ప్రాథమిక విద్యాభాసం కరీంనగర్‌లో పూర్తి చేశారు. 1963లో వాణినికేతన్‌ విద్యాసమితి ఆధ్వర్యంలో ప్రాథమిక విద్యాలయం ప్రారంభించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీఈడీ కళాశాలలను నెలకొల్పారు. నే టి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ గంగుల కమలాకర్, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, తదితర ప్రముఖులు వాణినికేతన్‌ పాఠశాలల్లో చది వారు. రా మారావు సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులుగా పని చేశారు. విద్య, సాహితీ సేవలకు గాను ప్రభుత్వంనుంచి అవార్డులు, సత్కారాలు పొందారు. 

నైతిక విలువలు గల విద్యావేత్త...
నైతిక విలువలు గల విద్యావేత్త అయోధ్యరామారావు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఐదు దశాబ్దాలుగా విద్యావేత్తగా జిల్లా అభివృద్ధిలో భాగమయ్యారని అన్నారు. ఆయన తనకు చిన్నప్పుడు లెక్కల మాస్టర్‌గా చదువు చెప్పారని, విలువలతో కూడిన అందించారని, ఆయన లేని లోటు తీరనిదని, ఆయన అడుగు జాడల్లో తామందరం నడుస్తామని అన్నారు. ఇటీవలనే దసరా రోజున ఫోన్‌లో మాట్లాడుతూ తాను లేకున్నా విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తాను కలుస్తానని చెప్పాను.. ఇంతలోనే ఇలా జరుగడం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. మంత్రి వెంట ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికుమార్, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్, మాజీ జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top