పాసుబుక్ ఉంటే కావల్సినన్ని విత్తనాలు | Minister POCHARAM says commented | Sakshi
Sakshi News home page

పాసుబుక్ ఉంటే కావల్సినన్ని విత్తనాలు

May 17 2016 2:35 AM | Updated on Nov 9 2018 5:56 PM

పాసుబుక్ ఉంటే కావల్సినన్ని విత్తనాలు - Sakshi

పాసుబుక్ ఉంటే కావల్సినన్ని విత్తనాలు

ఖరీఫ్ విత్తనాలు, ఎరువుల సరఫరాకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అధికారులను అప్రమత్తం....

గతేడాది ధరలకే పంపిణీ:
మంత్రి పోచారం

 
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ విత్తనాలు, ఎరువుల సరఫరాకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేస్తోంది. పాసుబుక్ ఉన్న రైతులందరికీ అవసరమైనన్ని విత్తనాలను సరఫరా చేస్తామని, కౌలురైతులకూ ఇది వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల సరఫరాపై జిల్లా వ్యవసాయ, ఇతర అధికారులతో సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథితో కలసి సచివాల యంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. విత్తనాలు, ఎరువులను 906 సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులోకి తెస్తామని, వాటికి కొరతే లేదన్నారు. రైతులకు అవసరమైన సహకార రుణాలను తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్) ద్వారా అందజేస్తామన్నారు. పత్తి సాగును తగ్గించాలని, సోయాబీన్, పప్పుధాన్యాల సాగు పెంచాలని ప్ర భుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు 4 లక్షల క్వింటా ళ్ల సోయాబీన్ విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

పెస ర, కంది, మినుములు, సోయాబీన్ వంటి విత్తనాలను గతేడాది ధరలకే అందజేస్తామన్నారు. 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలతోపాటు అన్ని రకాల విత్తనాలు కలిపి 8.50లక్షల క్వింటాళ్ల మేర అందజేస్తామన్నారు. వచ్చే ఖరీఫ్‌కు 17.87 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమన్నారు.

అందు లో 8.16 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉందన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, లక్ష టన్నుల డీఏపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. రబీ విస్తీర్ణం తగ్గడం వల్ల దిగుబడులు కూడా పెద్ద ఎత్తున తగ్గాయన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించే పాలీహౌస్‌లను బీమా పరిధిలోకి తేవాలని నిర్ణయించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement