
అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేకే ఆరోపణలు
‘అసలు బుద్ధుండి మాట్లాడుతున్నారా.. అసెంబ్లీకి వచ్చే ధైర్యంలేదు టీవీలు చూసి మాట్లాడతా రా..’ అంటూ మంత్రి ....
ప్రతిపక్షాలపై మంత్రి లక్ష్మారెడ్డి ఫైర్
నవాబుపేట: ‘అసలు బుద్ధుండి మాట్లాడుతున్నారా.. అసెం బ్లీకి వచ్చే ధైర్యంలేదు టీవీలు చూసి మాట్లాడతా రా..’ అంటూ మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రతిపక్షాలను విమర్శిం చారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక కొత్త అధ్యాయమన్నారు. సోమవారం మండలంలోని దయపంతులపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో మాట్లాడే వాయిస్ లేక టీవీలు చూసి విమర్శలు చేశారని మంత్రి ధ్వజమెత్తారు. గత పాలకులు తెలంగాణ ప్రజలపై ఇంత ప్రేమచూపి ఉంటే ఈ దుర్గతి పట్టేదికాదన్నారు.
మిషన్ కాకతీయ పనులు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాయని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా తాజాగా బడ్జెట్లో నిధులు కేటాయించామని మంత్రి వివరించారు. పాలమూరు ప్రాజెక్టు కోసం ప్రత్యేక కార్యక్రమం ద్వారా పనులు పూర్తి కానున్నాయని, దీనికం టే ముందు వచ్చే ఖరీఫ్‌లో 14లక్షల ఎకరాలకు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి సాగునీటిని అందించే లక్ష్యంతో పనులు త్వరలో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ ఇందిరాదేవి, ఎంపీపీ శ్రీనివాస్, నర్సింహులు, రవిందర్‌రెడ్డి, నర్సింహచారి పాల్గొన్నారు.