చార్మినార్ లో వైఫై సేవలు ప్రారంభం | minister KTR starts free wifi at charminar | Sakshi
Sakshi News home page

చార్మినార్ లో వైఫై సేవలు ప్రారంభం

Jun 2 2015 5:43 PM | Updated on Aug 30 2019 8:24 PM

నగరంలో ఉచిత వైఫై సేవలు విస్తరించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

హైదరాబాద్ : నగరంలో ఉచిత వైఫై సేవలు విస్తరించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలుచోట్ల ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉండగా.. ఇక చార్మినర్ ప్రాంతంలో కూడా ఉచిత వైఫై వినియోగానికి మార్గం సుగుమం అయ్యింది.రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు ఉచిత వైఫై సేవలను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. సేవలు ప్రారంభించిన అనంతరం వాటి పనితీరును ఆయన పర్యవేక్షించారు.

 

సందర్శకుల సౌకర్యార్థం ఇటీవలే ట్యాంక్ బండ్ మరికొన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ సర్కారు ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement