మెదక్ ఆర్డీఓగా మెంచు నగేష్ | menchu nagesh as RDO | Sakshi
Sakshi News home page

మెదక్ ఆర్డీఓగా మెంచు నగేష్

Nov 11 2014 11:56 PM | Updated on Sep 2 2017 4:16 PM

మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా మెంచు నగేష్‌ను....

సంగారెడ్డి క్రైం: మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా మెంచు నగేష్‌ను నియమిస్తూ మంగళవారం సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన ఎం.వనజాదేవిని హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఆమెను పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లోపేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న నగేష్‌కు జిల్లాతో అనుబంధం ఉంది.

గతంలో ఆయన సంగారెడ్డి తహశీల్దార్‌గా,  కలెక్టరేట్‌లో పరిపాలనాధికారిగా, గజ్వేల్ తహశీల్దార్‌గా పనిచేశారు. సమర్ధుడైన అధికారిగా మంచి గుర్తింపు పొందారు.  జిల్లా భౌగోళిక పరిస్థితులపై సంపూర్ణమైన అవగాహన ఉంది.

 జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిగా మధు
 జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిగా ఓ.జె.మధు నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన ఆయన, ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. మధును మెదక్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement