నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు | Membership Registration of Congress from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు

Nov 16 2014 1:22 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాలో ఆదివారం ప్రారంభంకానుంది.

{పారంభించనున్న ఏఐసీసీ దూత రామచంద్రకుంతియా
డిండిలోని ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో కార్యక్రమం
హాజరుకానున్న రాష్ట్ర, జిల్లా నేతలు


కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాలో ఆదివారం ప్రారంభంకానుంది. తెలంగాణ కాంగ్రెస్ పిలుపుమేరకు పార్టీలో యువరక్తాన్ని నింపాలన్న లక్ష్యంతో సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. జిల్లాలో తొలిసారిగా దేవ రకొండ డివిజన్ పరిధిలోని డిండి మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ దూత రామచంద్ర కుంతియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ పక్ష నేత కుందూరు జానారెడ్డి, తెలంగాణ వర్కి ంగ్ ప్రెసిండెంట్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జె డ్పీ చైర్మన్ నేనా వత్ బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి తో పాటు ఇతర పార్టీ సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. తొలి రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డిండిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో కార్యక ర్తలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.
 
శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయం

 కొత్త సభ్యత్వాలతో పాటు, నియోజకవర్గాల వారీగా పార్టీ శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో జిల్లా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామ, మండల శాఖలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా తయారైంది. అదీగాక పార్టీ జిల్లా బాధ్యతలు చూస్తున్న నేతలు సైతం వివిధ కార్యక్రమాలకు గైర్హాజరుకావడం పట్ల పార్టీలో పలువురు సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందిరా, రాజీవ్ గాంధీ వర్ధంతులు, చాచా నెహ్రూ జయంతి వేడుకులకు కూడా జిల్లా పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో పార్టీ పెద్దలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీలో ఇంటిలొల్లి తీవ్రంకావడంతో పార్టీ ఉనికికే ముప్పు ఏర్పడింది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారంతా తమ నియోజకవర్గం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేపడతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ మేరకు ముందుకు సాగుతుందో వేచి చూడాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement