బోణీ అయ్యింది... | medak mp the position of nomination | Sakshi
Sakshi News home page

బోణీ అయ్యింది...

Aug 22 2014 12:05 AM | Updated on Oct 17 2018 6:27 PM

బోణీ అయ్యింది... - Sakshi

బోణీ అయ్యింది...

మెదక్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ల్లో గురువారం తొలి నామినేషన్ దాఖలైంది.

మెదక్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి
సంగారెడ్డి టౌన్: మెదక్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ల్లో గురువారం తొలి నామినేషన్ దాఖలైంది. మెదక్ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి రవికిరణ్‌రెడ్డి బొజ్జ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా  కలెక్టర్ శరత్‌కు దాఖలు చేశారు. రవికిరణ్ రెడ్డి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామం.

శ్రీరామానంద తీర్థ ఇన్‌స్టిట్యూట్‌కు సీఈఓగా మూడు సంవత్సరాలు పనిచేసిన రవికిరణ్‌రెడ్డి, యూఎన్‌డీప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఔషధ మొక్కల సంస్థ సలహాదారుడిగా కూడా పనిచేశారని తెలిసింది. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీకి బయోడైవర్సిటీ నిపుణులుగా కూడా రవికిరణ్‌రెడ్డి పనిచేసినట్లు సమాచారం. రాజకీయాలపై మక్కువతోనే సెప్టెంబర్ 13న జరగనున్న మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement