డబ్బుంటే టీఆర్ఎస్ టికెట్ కొనుక్కునేవాడ్ని | Medak bjp mp condidate jaggareddy slams trs | Sakshi
Sakshi News home page

డబ్బుంటే టీఆర్ఎస్ టికెట్ కొనుక్కునేవాడ్ని

Sep 1 2014 12:53 PM | Updated on Mar 29 2019 9:24 PM

డబ్బుంటే టీఆర్ఎస్ టికెట్ కొనుక్కునేవాడ్ని - Sakshi

డబ్బుంటే టీఆర్ఎస్ టికెట్ కొనుక్కునేవాడ్ని

మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి మరోసారి టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉందంటే అది బీజేపీ పెట్టిన భిక్షేనని ...

హైదరాబాద్ :  మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి మరోసారి టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉందంటే అది బీజేపీ పెట్టిన భిక్షేనని ఆయన సోమవారమిక్కడ అన్నారు.  తన దగ్గర డబ్బుంటే టీఆర్ఎస్ టికెట్నే కొనుక్కునేవాడినని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ రావు రోజూ జగ్గారెడ్డి జపం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాలు కాదని... అభివృద్ధిపై చర్చించే దమ్ముందా అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు.  కాగా  ప్రజలు జగ్గారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించలేనివారు..ఎంపీగా గెలిపిస్తారనుకోవడం హాస్యాస్పదమని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement