వివాహిత ఆత్మహత్య | Married woman committed suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jan 25 2016 5:53 PM | Updated on Nov 6 2018 7:56 PM

కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ధారూరు మండలం సర్పన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ధారూరు మండలం సర్పన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లలిత(25) అనే వివాహితకు మండల పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామానికి చెందిన లక్ష్మన్‌తో 5 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహితకు తరుచూ కడుపునొప్పితో బాధపడుతూ అస్వస్థతకు గురై అనారోగ్యంగా ఉండేది. ఈ బాధను భరించలేక ఆదివారం రాత్రి తల్లిగారి ఇంట్లోనే దులానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసకుంది. ఈమెకు కొడుకు హరిప్రసాద్, కూతురు శివానిలు ఉన్నారు. తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement