సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేటాయించిన ఇళ్లలో తప్పనిసరిగా నివసించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పూర్తి అయిన, నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. టూ బీహెచ్‌కే ఇండ్లు పొందిన వారు వాటిలో నివసించకపోతే, వారికి ఇచ్చిన ఇళ్లను నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రద్దు చేసిన ఇళ్లను కొత్త లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. సంబంధిత ఆర్డీఓలు, డిప్యూటీ కమిషనర్లు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్2 లిస్ట్ నుండి పేదవారిని ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


