వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం | Married woman attempt to sucide not to bare of husband harrassements | Sakshi
Sakshi News home page

వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం

Jun 28 2015 10:50 PM | Updated on Sep 3 2017 4:32 AM

వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం

వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం

భర్త వేధింపులకు తాళలేక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం నాచారం పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది.

నాచారం (హైదరాబాద్): భర్త వేధింపులకు తాళలేక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం నాచారం పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాచారం ఎర్రకుంటకు చెందిన అక్తర్‌హుస్సేన్ గత కొంత కాలంగా మద్యం సేవించి తన భార్య మున్సూరబేగంను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు.

భర్త వేధింపులకు తాలలేక మున్సూరబేగం ఆదివారం మద్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాందీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాధితురాలి బంధువులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement