ఏటీఎం చోరికి యత్నించిన దుండగులు

Theifs Try To Robbery At Nacharam ATM Machine Center - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాచారం చౌరస్తాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎమ్ కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు చోరికి పాల్పడుతుండగా మిషన్ లో ఉన్న సెన్సార్ ఆధారంగా చోరీ జరుగుతుందని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే దొంగలు అక్కడినుంచి పరారయ్యారు. ఏటీఎమ్ లో ఉన్న డబ్బును దొంగిలించడానికి దుండగులు నానా విధాలుగా ప్రయత్నం చేశారు. చోరీ చేసే యత్నంలో ఏటీఎమ్ మిషన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎం సెంటర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top