పరీక్ష రాసి వచ్చి.. పెళ్లి పీటలపైకి.. | Married after fishing exam | Sakshi
Sakshi News home page

పరీక్ష రాసి వచ్చి.. పెళ్లి పీటలపైకి..

Mar 12 2016 5:07 AM | Updated on Sep 3 2017 7:30 PM

పరీక్ష రాసి వచ్చి.. పెళ్లి పీటలపైకి..

పరీక్ష రాసి వచ్చి.. పెళ్లి పీటలపైకి..

ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లికి చెందిన ఓ యువతి శుక్రవారం ఇంటర్ పరీక్ష రాసి వచ్చి.. పెళ్లి పీటలపై కూర్చుంది.

ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లికి చెందిన ఓ యువతి శుక్రవారం ఇంటర్ పరీక్ష రాసి వచ్చి.. పెళ్లి పీటలపై కూర్చుంది. గ్రామానికి చెందిన ఆదె తారాబాయి-బాపుల కుమార్తె శ్రీవాణికి మండల కేంద్రానికే చెందిన ననుబాయి-లింగయ్య దంపతుల కుమారుడు గోపాల్‌తో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు.

ముహూర్తం శుక్రవారం ఉదయం 8.40కి ఖరారు చేశారు. శ్రీవాణి ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, పెళ్లి ముహూర్తం రోజే పరీక్ష వచ్చింది. ఏడాది పాటు కష్టపడి చదివిన శ్రీవాణి ఉదయం పరీక్ష రాసి వచ్చాకే పెళ్లి కూతురిగా పీటపైకి ఎక్కి వివాహం చేసుకుంది.    - దహెగాం

Advertisement
 
Advertisement
Advertisement