అభ్యర్థులకు పెళ్లిళ్ల తిప్పలు

Marriages In Same Cooperative Election Date  - Sakshi

సహకార ఎన్నికల రోజు పెళ్లి ముహూర్తాలు

ఆందోళనలో నేతలు, పోటీ దారులు

సాక్షి, కేతేపల్లి: ఈ నెల 15న సహకార ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అదేరోజు అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో నేతలు, డైరెక్టర్‌ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్‌ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని 15న ఓటింగ్‌కు రావాలని కోరితే చాలా మంది వివాహాలు ఉన్నాయని చెబుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. గ్రామాల్లో ఉన్న వారు కూడా ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువుల ఇంట జరిగే వివాహాలకు ఒకట్రెండు రోజుల మందు వెళ్లే అవకాశముంది. పక్కాగా తమకే పడతాయన్న ఓట్లు పెళ్లిళ్ల కారణంగా పోలయ్యే అవకాశం కనిపించకపోవడంతో అభ్యర్థులకు పాలుపోవడం లేదు.

పెళ్లి కాగానే వచ్చి ఓటేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే  పోలింగ్‌ ఉండడంతో దూర ప్రాంతాలకు వెళ్లిన వారిని ఓటింగ్‌ పూర్తయ్యే సమయానికి తీసుకొచ్చే వీలుండదు. పెళ్లి మూహూర్తాలు పోలింగ్‌పై తప్పకం ప్రభావం చూపనున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top